telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్ విడుదల…

టాలీవుడ్ లోకి సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా వచ్చిన యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల ‘వి’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.`వి` చిత్రానికి మిశ్రమ స్పందనలు రాగా సుధీర్ బాబు కాప్ రోల్ కి మంచి పేరొచ్చింది. ఈ సినిమా లో సుధీర్ బాబు యాక్టింగ్ కు అభిమానులు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే తనతో రెండు సినిమాలు చేసిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో కలిసి మరో సినిమా చేస్తున్నాడు సుధీర్ బాబు. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజగా ఈ సినిమా నుండి ఓ అప్డేట్ వచ్చింది. మార్చి 1న ఈ సినిమా టైటిల్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్ ను విడుదల చేస్తు ప్రకటించింది. అయితే సుధీర్ బాబు సమర్పణలో వస్తున్న ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా రానున్న ఈ చిత్రాన్ని బి.మహేంద్రబాబు – కిరణ్ బాలపల్లి నిర్మిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సుధీర్ బాబు ప్రస్తుతం పలాస దర్శకుడు కరుణ కుమార్ తో సినిమా ను అనౌన్స్ చేసాడు సుధీర్. శ్రీదేవి సోడా సెంటర్ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts