telugu navyamedia
క్రైమ్ వార్తలు

ప్రియుడిచ్చిన ముద్దుతో 300 కుట్లు…!?

Student Lip was bitten off by her Ex
ఓ ప్రియుడు చేసిన పిచ్చి పనితో ప్రియురాలి పెదవుల చుట్టూ 300 కుట్లు పడ్డాయి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. గ్రీన్‌విల్లేకు చెందిన కైలా అనే యువతి సెథ్ ఆరన్ అనే యువకుడితో 2016లో డేటింగ్ మొదలుపెట్టి, ఏడాది తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు కైలాను కలవడానికి వచ్చిన సెథ్ ఆమెకు గ్రీటింగ్ కార్డు ఇచ్చి, కలిసి ఉందామని కోరాడు. కానీ సెథ్ తనను మనిషిలా కాకుండా ఓ వస్తువులా చూస్తున్నాడనే భావనలో ఉన్న కైలా అతనితో ఇంకెప్పుడూ కలవనని చెప్పి తెగదెంపులు చేసుకుంది. దీంతో కైలాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్న సెథ్ ఆమెకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు.
కానీ కైలా పక్కకు తోసేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సెథ్‌… కైలాను గట్టిగా పట్టుకుని ఆమె పెదవుల కింద గట్టిగా కొరికేశాడు. ఆ గాయం కారణంగా కైలాకు దాదాపు 300 కుట్లు పడ్డాయి. ఆ గాయం నుంచి బయట పడటానికి తనకు సంవత్సరం సమయం పట్టిందని, సెథ్ లాంటి వ్యక్తిని చూశాక వేరొకరిని ప్రేమించాలంటేనే భయం వేసిందని, కానీ బ్లేక్ అనే వ్యక్తి తన జీవితంలోకి వచ్చాక తన జీవితం పూర్తిగా మారిపోయిందని కైలా చెప్పింది. పోలీసులు సెథ్‌ను అరెస్ట్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేరంలో కోర్టు సెథ్‌కు 12 ఏళ్ల జైలుశిక్షను విధించింది.

Related posts