student leader asking protection due to threat call

జె ఎన్ యూ విద్యార్ధి నాయకుడికి, చంపేస్తాం అంటూ బెదిరింపు

50

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ విద్యార్ధి నాయకుడు ఉమర్ ఖాలిద్ నిన్న తనకు ప్రాణహాని ఉందని చంపేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చిందని పోలీసులను ఆశ్రయించాడు. పేరుమోసిన గ్యాంగ్ స్టార్ రావిపూజారి నుండి తన ప్రాణానికి ముప్పు ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఢిల్లీ పోలిసులు తెలిపారు. గుజరాత్ స్వతంత్ర అభ్యర్థి జిగ్నేష్ మాన్వి కూడా ప్రాణహాని బెదిరింపు కాల్ వచ్చాయి, ఈయన కూడా గ్యాంగ్ స్టార్ రవి పూజారి నుండి కాల్ వచ్చినట్టు తెలిపారు.

ఉమర్ ఖాలిద్ రవి పూజారి నుండి తనకు జిగ్నేష్ మాన్వి ఇద్దరికి ప్రాణహాని ఉందని తాను హిట్ లిస్ట్ లో ఉన్నట్టు, అందుకే తాను పోలీస్ ప్రొటెక్షన్ కోరినట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. గతం లో 2016 లో కూడా తనకు రావిపూజారి బెదిరింపులకు పాల్పడట్టు తెలిపారు, అప్పుడు తన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా 2001 పార్లమెంట్ ఫై దాడి కేసు నిందితుడు ఆఫ్జాల్ గురును ఉరి తీస్తే దానికి వ్యతిరేకంగా తీసిన ర్యాలీలో ఉండి రాజద్రోహం మోపబడ్డ వాళ్లు, కన్నయ్య, అనిర్బన్ భట్టాచార్య, ఉమర్ ఖాలిద్ ఉన్నారు.