telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మాస్క్ పెట్టుకొని వారిపై పెట్టి కేసులు…

hyderabad students rali

ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో కఠిన ఆంక్షలు విధించారు.  ఇప్పటికే మాస్క్ తప్పనిసరి చేశారు.  మాస్క్ తప్పనిసరి చేసినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తుండటంతో ఆంక్షలను మరింత కఠినం చేశారు.  మాస్క్ పెట్టుకోకుండా కనిపిస్తే రూ.1000 ఫైన్ తో పాటుగా మూడు కమిషరేట్ పరిధిలో కేసులు కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.  మాస్క్ పెట్టుకోకుండా తిరిగే వారిపై పెట్టి కేసులు, షాపింగ్ మాల్స్, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో ప్రజలు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలను అతిక్రమించే షాపు యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని పోలీసులు ఆదేశించారు.  ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కేసులు పెరుగుతుండటంతో చాలా మంది ప్రజలు తమ తమ సొంత గ్రామాలకు వెళ్లిపోతున్నారు.

Related posts