telugu navyamedia
సినిమా వార్తలు

వర్మ “కోబ్రా”… మోస్ట్ డేంజరస్ క్రిమినల్ బయోపిక్

RGV's Cobra Movie Story
ఇటీవలే “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాతో చాలాకాలం తరువాత హిట్ ను అందుకున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన తరువాత ప్రాజెక్టులుగా శశికళ, కేసీఆర్ బయోపిక్ లు ఉండబోతున్నాయని ప్రకటించారు. కానీ ఇప్పుడు రూటు మార్చి తన పుట్టినరోజు సందర్భంగా “కోబ్రా” మోస్ట్ డేంజరస్ క్రిమినల్ బయోపిక్ అంటూ మరో ప్రకటన ఇచ్చేశారు. ఇప్పటి వరకూ దర్శకుడిగా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, గాయకుడిగా తన సత్తా చాటిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నటుడుగా ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ చిత్రాన్ని ఆర్జీవీ గన్‌ షాట్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో వర్మ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్మ, అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. “కోబ్రా” సినిమా మొత్తం నయీం చుట్టూ తిరగబోతందనేది తాజా సమాచారం. కోబ్రా అనేది నయీం ని పట్టుకోవటానికి పెట్టుకున్న ఆపరేషన్ పేరని, నయీంని పట్టుకునేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ద, 2016 ఆగస్టు 8న షాద్‌నగర్‌ పట్టణ శివారులోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఒక్కసారిగా పోలీసులు నయాం ఉన్న ఇంటిని చుట్టుముట్టడం వెనక వేసిన భారీ స్కెచ్, పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన కరుడుగట్టిన నేరస్తుడు, వంద కేసుల్లో నిందితుడు, 40హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు నయీంని ఎలా హతమార్చాడు ? ఇలాంటి మోస్ట్ వాంటెడ్  క్రిమినిల్ పట్టుకోవటానికి ఓ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేవి తెరపై చూపించబోతున్నారు

Related posts