telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు : 11 వేల మార్క్ దాటిన నిఫ్టీ..

husge loses again in stock markets

అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం ఉండటంతో స్టాక్‌మార్కెట్లు లాభాలతో మదుపరులను ఊరిస్తున్నాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 165 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ 11,400 మార్క్‌ వద్ద కదలాడింది. ఆటో, ఐటీ, ఎనర్జీ, బ్యాంకింగ్‌, ఇన్‌ఫ్రా, ఫార్మా సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండగా.. ఎఫ్‌ఎంసీజీ, లోహ సూచీలు ఒడుదొడుకులకు గురవుతున్నాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్‌ 255 పాయింట్లకుపైగా లాభంతో తిరిగి 38,000 మార్క్‌కు చేరుకోగా.. నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 11,421 వద్ద ట్రేడవుతోంది.

డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడి ఏడు నెలల గరిష్టానికి చేరుకుని 69.17 వద్ద కొనసాగుతోంది. కోటక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో, టైటాన్‌ కంపెనీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. హెచ్‌యూఎల్‌, కోల్‌ ఇండియా, జీఎంటర్‌టైన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Related posts