ఎస్.బి.ఐ (స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా) తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిపే లావాదేవీలపై చార్జీలను ఎత్తేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ యాప్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరిపే ఖాతాదారులకు చార్జీల నుంచి ఊరట లభించనుంది.
దీనికి ముందు ఆయా సేవలకు గాను (నెఫ్ట్,ఆర్టీజీఎస్) నిర్ణీత చార్జీలు వసూలు చేసింది ఎస్‌బీఐ. అలాగే, ఏటీఎం నుంచి నగదు డ్రా చేసే విషయంలో ఉన్న పరిమితుల విషయంలోను త్వరలో నిర్ణయం తీసుకొనుంది. భారత ప్రభుత్వ విజన్‌లో భాగమయిన డిజిటల్ ఎకానమీలో భాగమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ వర్గాలు తెలిపాయి.
నీ వక్షోజాలు ముట్టుకోవచ్చా అని అడిగాడు : షెర్లిన్ చోప్రా