తెలంగాణ రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న ఎస్టీ విద్యార్థులు రూ.50 వేల గ్రాంట్ పొం దేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు గిరిజన సంక్షేమశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. మెడిసిన్, ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సులు అభ్యసిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్‌షిప్‌లు ఏవీ పొందనివారే ఈ గ్రాంట్‌కు అర్హులని పేర్కొన్నది. దరఖాస్తులను హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని కోరింది.