telugu navyamedia
ఆంధ్ర వార్తలు విద్యా వార్తలు

మే 24 నుంచి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు

మే 24 నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ, ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) వి.శ్రీనివాసరావు ప్రకటించారు.

మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, మే 24 నుంచి జూన్ 3 వరకు ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఆర్‌వో తెలిపారు.

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయి.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షల్లో అవకతవకలు నిరోధించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు

Related posts