telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కెన్యా కపుల్ నోట… షారుఖ్ ఖాన్ పాపులర్ పాట…!

Sharukha-Khan

గతంలో షారూఖ్, కాజోల్ జంటగా నటించిన “దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే” సినిమాలో “తుజే దేఖా తో యే జానా స‌న‌మ్” అనే సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆనాటి పాట ఇప్ప‌టికి సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ ఉంటుంది. కేవ‌లం మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోను ఈ పాటంటే ప‌డిచచ్చిపోయే వాళ్ళు చాలా మందే ఉన్నారు. తాజాగా కెన్యాలో ఓ జంట ఈ రొమాంటిక్ సాంగ్‌కి పెదాలు క‌దుపుతూ వీడియో రూపొందించారు. ఈ వీడియోని “తుజే దేఖా తో.. సాంగ్‌ని కంపోజ్ చేసిన ల‌లిత్ షేర్ చేశాడు” అంటూ అనుప‌మ్ ఖేర్ త‌న ట్వీట్‌లో తెలిపాడు. చాలా మంది ప్ర‌ముఖులు ఈ పాట‌పై త‌మ స్పంద‌న వినిపిస్తుండ‌గా, షారూఖ్, కాజోల్ మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts