శ్రీశైల మల్లన్నను తాకి చూడండి ?

19

హిందువులు చాలా గొప్పోళ్ళు… ఎందుకంటే ?
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైలం లో ఒకప్పుడు శివ లింగాన్ని తాకి, అభిషేకం చేసే అవకావం ఉండేది . ఇది చాలామంది భక్తులకు అనుభవంలో వున్నదే .
ఆ తరువాత స్వమయ్వారిని ముట్టుకోవాలంటే 100 రూపాయలు టిక్కెట్టు పెట్టారు. ఇదీ తెలిసిందే .
మరికొన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఏకంగా టిక్కెట్టు రేటు 1116 పెంచేశారు .
స్వామివారిని ఇప్పుడు సామాన్యులు ముట్టుకోలేరు . ఎందుకంటే ఇప్పుడు వారిని తాకి అభిషేఖం చెయ్యాలంటే 5000 రూపాయలు చెల్లించాల్చిందే !
అయినా హిందువులు అందులో ధనవంతులు డబ్బు కోసం చూసుకోరు 5000 ఇచ్చి, గర్భాలయంలో అభిషేకం చేయిస్తారు .
అంతేకాని పేద వాడికి ఈ దేవుడు అందుబాటులో ఉండటంలేదు అని అనుకోరు .
ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల -వ్యాపారం బాగుంది. ప్రభుత్వమే ఈ వ్యాపారం చేయిస్తుంది మరి .
శ్రీశైలం లో దేవాలయానికి మొదటగా దిక్కు-దివాణం, అండగా ఉన్నది అక్కడి చెంచులు, ఆటవికులు. వారినైనా ఫ్రీగా గర్భాలయం లోకి రానిస్తారా లేదా ? ఆలయాన్ని విస్తరించి, అద్భుతంగా తీర్చిదిద్దిన రెడ్డి రాజులకు కూడా పాపం తెలివి లేదు. ఆరోజున ఈ దేవాలయం ఇలా అవుతుందని అనుకుంటే ………
ఈ దేవాలయాన్ని ఎంత అభివృద్ధి చేసేవారు కాదేమో!

ఇప్పటి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది .
ఉత్తరప్రదేశ్ ను పాలించిన నేతలకు ఇలాంటి ఆలోచన రాలేదు ఎందుకంటే… కాశీలో ఇప్పటికీ ఎలాంటి రుసుము లేకుండా శివలింగానికి…భక్తులే గంగ నీరు తెచ్చి అభిషేకం చెయొచ్చు. ఎన్నో ఏళ్లగా వస్తున్నా ఆచారం ఇప్పటికీ మారలేదు మరి !
గ్రామాలలో గుళ్లలో దేవుడికి దీపం పెట్టే పూజారులు డబ్బులేక అవస్థలు పడుతుంటారు. ఏ మహానుభావుడో ఓ 500 రూపాయలు ఇస్తే చాలు, వారం హాయిగా బతకొచ్చని వెర్రి చూపూలు చూస్తుంటాడు. అయినా అక్కడికి ఎవరు రారు, ఇవ్వరు. గ్రామాల్లోని పురాతన దేవాలయాలు శిథిలం అవుతుంటాయి. డబ్బురాని , గుళ్లను ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి . . తమ ఆధీనంలోని గుళ్లలో అధిక టికెట్లతో, హుండీలతో భక్తుల డబ్బును దోచేస్తున్నాయి .
కోట్లు డబ్బు దండుకుని… ఏనాడు ఫ్రీగా ఒక భగవద్గీత పుస్తకం కూడా భక్తులకు పంచిపెట్టిన దాఖలాలు లేవు
ఎంతైనా… నోరు మెదపని తెలుగువారు గొప్పోళ్ళు కదూ. తప్పులు చూపిస్తే… నువ్వు ఫలానా పార్టీ అంటారు…ఫలానా కులం అంటారు…
భక్తి ఖరీదై పోయింది . అయినా భక్తులకు చీమ కొట్టినట్టుగా కూడా లేదు . గొప్పోళ్ళు మన వాళ్ళు .!