telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్

జగన్ పై దాడి కేసు : .. నిందితుడి బెయిల్ రద్దు.. విచారణ షురూ..

srinivas jagan case

జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బెయిల్ రద్దు పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్ఐఏ న్యాయవాది మాట్లాడుతూ.. శ్రీనివాస్ కు ఎన్ఐఏ కోర్టు జారీచేసిన బెయిల్ ను రద్దుచేయాలని కోరారు. శ్రీనివాస్ లాంటి క్రిమినల్ బయట ఉంటే ప్రమాదమని వాదించారు. అయితే ఈ వాదనలను శ్రీనివాస్ న్యాయవాది ఖండించారు.

బెయిల్ జారీ సందర్భంగా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు శ్రీనివాస్ నడుచుకుంటున్నారనీ, ఎక్కడా బెయిల్ నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్ పై తదుపరి విచారణను జూన్ 26కు వాయిదా వేసింది. ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొని హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో 2018, అక్టోబర్ 25న శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ జగన్, హైదరాబాద్ లో శస్త్రచికిత్స చేయించుకున్నారు.

Related posts