telugu navyamedia
సినిమా వార్తలు

శిఖండిని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తున్న బిగ్ బాస్… తూ… : శ్రీరెడ్డి

Srireddy

వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచే వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఇప్పుడు బిగ్ బాస్-3 తెలుగు షోను టార్గెట్ చేసింది. తెలుగు బిగ్ బాస్ షో తనకు అస్సలు ఇష్టం లేదని చెబుతూ బిగ్ బాస్ వ్యాఖ్యతపై సంచలన కామెంట్స్ చేసింది. “నాగార్జునకు తెలిసినన్ని రాజకీయాలు చంద్రబాబుకు కూడా తెలియవు… డబ్బిస్తే బిగ్ బాస్ హీరో.. లేదంటే ఎదవ” అంటూ పోస్ట్ చేసింది. మరోవైపు ఈ షోను ఆపేయ్యాలంటూ పోరాటం చేస్తున్న యాంకర్ శ్వేతా రెడ్డికి తన మద్దతు ప్రకటిస్తూ ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను జతచేసి ” శ్వేతారెడ్డి గారూ.. మీ దెబ్బకి బిగ్ బాస్ తెలుగు అట్టర్ ఫ్లాప్ అయింది.. నాకు కూడా తమిళ బిగ్ బాస్ బాగా నచ్చింది కానీ తెలుగు కాదు.. నా సపోర్ట్ మీకే” అంటూ “రెడ్డి పవర్” అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక అక్కడితో ఆగకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నాపై కూడా కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. తమన్నాను టార్గెట్ చేస్తూ బిగ్ బాస్‌కు బిగ్ భయ్యా దొరికాడని, నాగార్జున భయ్యా సెలక్షన్ సూపర్ అంటూ సెటైర్ వేసింది శ్రీరెడ్డి. ఇక ఇప్పుడు తమన్నా రచ్చపై శ్రీరెడ్డి మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేసింది. “శిఖండిని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తున్న బిగ్ బాస్… తూ.. తెలుగు బిగ్ బాస్ నాశనం” అంటూ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. అయితే బిగ్ బాస్ లో తమన్నా చేష్టలతో హౌజ్ మేట్స్, ప్రేక్షకులు విసిగిపోతున్నారు.

Related posts