సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగిన బోర్డు సమావేశంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావుతో కలిసి శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ మాట్లాడుతూ, ఏప్రిల్ 5 నుండి 15 వరకు వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, ఏప్రిల్ 11న శ్రీ సీతారామ కళ్యాణం రాష్ట్ర ఉత్సవం జరుగుతుందని తెలిపారు.
టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం కూడా హాజరయ్యారు.