telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఢీ’ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైనది

srinu-vitla

మంచు విష్ణు కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ఢీ’. ఈ చిత్రం 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమా కబుర్లను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమా కబుర్లను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ‘‘ఢీ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతిరోజూ షూట్ చేయడం సవాలుగా ఉన్నప్పటికీ, చిత్రం కోసం పనిచేసిన ప్ర‌తి ఒక్క‌రు దీనిని నాకు సులభతరం చేసి మెమోర‌బుల్ జ్ఞాప‌కంగా మిగిల్చారు. నా నిర్మాత‌, స్నేహితుడు అయిన ఎంఎస్‌ఎన్ రెడ్డిగారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమాలో నటించిన నా సోద‌రుడు విష్ణుకి, జెనీలియా, దివంగత నటుడు శ్రీహ‌రి, పద్మశ్రీ బ్ర‌హ్మానందంగారికి, సునీల్‌, జేపీ ఇంకా ఇతరులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇలా ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ప్ర‌త్యేక ధ‌న్యవాదాలు..’’ అని శ్రీనువైట్ల తన ట్వీట్‌లో తెలిపారు.

Related posts