telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఆ సీజన్ కౌశల్ ఆర్మీ .. ఇప్పుడు శ్రీముఖి ఆర్మీ అట..

sreemukhi army like as kaushal army for bigg boss show

బిగ్‌బాస్-3 తొలిరోజు నుంచే హాట్‌హాట్‌గా నడుస్తోంది. వరుసగా నామినేషన్లు, టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో నడుస్తుంది బిగ్‌బాస్ సీజన్ త్రీ. బిగ్‌బాస్ విన్నర్‌గా గెలవాలంటే హాస్‌లో ఎలా ఉంటున్నామో అన్నది ఒక ఎత్తయితే, సోషల్ మీడియా ప్రచారం కూడా అంతే అవసరం. అవును.. సోషల్ మీడియాలో ప్రచారం ద్వారానే కంటెస్టెంట్లకు ఓట్లు పడతాయ్. బిగ్‌బాస్2 విన్నర్ కౌశల్ గెలుపులో సోషల్ మీడియా చాలా కీలకం. కౌశల్ ఆర్మీ అంటూ.. ఆ ఆర్మీ వల్ల కౌశల్ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అదే ఇప్పుడు ఫాలో అవుతోంది.. బిగ్ బాస్3 కంటెస్టెంట్ శ్రీముఖి.

ఈ సీజన్ షో హౌస్‌లోకి వెళ్లకముందే..శ్రీముఖి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో కొన్ని పేజీలు కనిపిస్తున్నాయి. తాజాగా కౌశల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దయచేసి నా పేరును కానీ.. కౌశల్ ఆర్మీని కానీ.. బిగ్‌బాస్ 3 కోసం లేదా పబ్లిసిటీ కోసం వాడుకోవద్దు.. ఇది నా వార్నింగ్ అంటూ పోస్ట్ చేశారు. చూస్తుంటే ఇది ఇన్‌డైరెక్టుగా శ్రీముఖీకే అని అంటున్నారు ఈ పోస్ట్ చూసిన కొందరు. ఏదిఏమైనా ఆర్మీ తయారైనట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడే విజేత ఎవరనేది కూడా తెలిసిపోయినట్టే కదా!

Related posts