telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులకు.. స్వాగతం పలుకుతున్న స్పైస్ జెట్ ..

spicejet welcoming jet airways employees

ఒక సంస్థ మూసివేయాల్సి వస్తే, ముందు ప్రభావితం అయ్యేది అందులో పనిచేసే ఉద్యోగులే. తాజాగా, జెట్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ కు చెందిన వేలమంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. వాళ్లలో కొందరు ఇతర ఎయిర్ లైన్స్ సంస్థల్లో తక్కువ జీతాలకే ఉద్యోగాలు చూసుకోగా, చాలామంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో, తామున్నామంటూ ముందుకు వచ్చింది స్పైస్ జెట్ విమానయాన సంస్థ.

స్పైస్ జెట్ యాజమాన్యం, ఇప్పటికే తాము జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని, త్వరలోనే మరింత మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ మాట్లాడుతూ, ఉద్యోగాలు కోల్పోయిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బందిని తాము విధుల్లోకి తీసుకుంటామని అన్నారు. త్వరలోనే మరిన్ని విమానాలు కొనుగోలు చేస్తున్నామని, అందువల్ల జెట్ ఎయిర్ వేస్ సిబ్బందికి తప్పకుండా అవకాశం ఉంటుందని తెలిపారు.

Related posts