telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం

వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ సభ్యులు దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు అన్నారు.

ప్రజాస్వామ్యంలో అది సమంజసం కాదు, దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరమేంటి? రిజిస్టర్ లో సంతకాలు పెట్టి సభలో కనిపించడంలేదు అని అన్నారు.

వైసీపీ సభ్యుల తీరు దురదృష్టకరం రిజిస్టర్ లో సంతకాలు చేసి సభలో కనిపించని ఏడుగురి ఎమ్మెల్యేల పేర్లు చదివిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధరెడ్డి, విశ్వేశ్వరరాజులు ఉన్నారు.

గవర్నర్ ప్రసంగం తర్వాత వేర్వేరు రోజుల్లో సంతకాలు చేసి వెళ్లినట్టు తెలుస్తోంది. మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని కోరుతున్నాం అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.

Related posts