telugu navyamedia
Uncategorized

కరోనా సోకి ఫుట్‌బాల్ యువ కోచ్ మృతి

spanish football coash

కరోనా వైరస్ బారినపడి స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా(21) మృతి చెందాడు. ఈ విషయాన్ని అథ్లెటికో పోర్టాడా ఆల్టా క్లబ్ వెల్లడించింది. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. అలాగే, కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంది. అందులో భాగంగా స్పానిష్ ఫుట్ ‌బాల్ లీగ్‌ను రెండువారాలపాటు వాయిదా వేసింది. అతి

మృతి చెందిన ప్రాన్సిస్కో ఇప్పటికే లుకేమియాతో బాధపడుతున్నాడు. అతడికి కరోనా వైరస్ సోకడంతో పరిస్థితి మరింత విషమించింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కరోనా కారణంగా మలాగా పట్టణంలో మృతి చెందిన చిన్న వయసు గల యువకుడు గార్సియా కావడం గమనార్హం.

Related posts