ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 టోర్నీ 21వ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టుపై ఆఫ్గనిస్థాన్ 34.1 ఓవర్లలో 125 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గనిస్థాన్ జట్టులో రషీద్ ఖాన్ (25 బంతుల్లో 35 పరుగులు, 6 ఫోర్లు), నూర్ అలీ జద్రాన్ (58 బంతుల్లో 32 పరుగులు, 4 ఫోర్లు), హజ్రతుల్లా జజయ్ (23 బంతుల్లో 22 పరుగులు, 3 ఫోర్లు) తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
సౌతాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 4 వికెట్లు పడగొట్టగా, క్రిస్ మోరిస్ 3, పెహ్‌లుక్‌వాయో 2, రబాడా 1 వికెట్ తీశారు. అయితే మ్యాచ్ మధ్యలో పలు సార్లు వర్షం పడి ఆటకు అంతరాయం ఏర్పడడంతో ఇరు వైపులా 2 చొప్పున ఓవర్లను తగ్గించారు. దీంతో 48 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించి తిరిగి ఆట ప్రారంభించారు.