భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. పర్యాటక జట్టు ఫాలోఆన్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ మొదలైన రెండో బంతికే ఇషాంత్ శర్మ టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఓపెనర్ మార్‌క్రమ్‌ని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని రెండో ఇన్నింగ్స్‌లో శుభారంభం చేశాడు.
శనివారం తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 275 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కేశవ్ మహారాజ్(72), ఫిలాండర్‌ల జోడి తొమ్మిదో వికెట్‌కు 109 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించారు. ప్రస్తుతం ఎల్గర్, డిబ్రయిన్ బ్యాటింగ్ చేస్తున్నారు.
వైఎస్ వివేకాను ఇంటి దొంగలే హత్య చేశారు: చంద్రబాబు