ఐపీఎల్ 2021 సీజన్‌ను కరోనా వైరస్ కమ్మేయడంతో లీగ్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే లీగ్ నిర్వహణ విషయంలో బీసీసీఐ అట్టర్ ఫ్టాప్ అయిందని, యూఏఈ వేదికగా నిర్వహించి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దాదా తమ నిర్ణయం సరైందేనని దాదా అన్నాడు. ఈ ప్రమాదాన్ని ఐపీఎల్ షెడ్యూల్ సిద్ధం చేసే సమయంలో తాము ఊహించలేకపోయామని తెలిపాడు. ఐపీఎల్ ప్రారంభం నాటికి దేశంలో కేసులు సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపాడు. ‘ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు స్వదేశంలో భారత్-ఇంగ్లండ్ సిరీస్‌లను సమర్థవంతంగా నిర్వహించాం. దాంతో.. ఐపీఎల్ 2021 సీజన్‌ను కూడా ఇక్కడే నిర్వహించాలనుకున్నాం. వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకునే సమయంలో భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొంత మంది సభ్యులు యూఏఈలో టోర్నీని నిర్వహిద్దామని ప్రతిపాదించారు. కానీ.. ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా చాలా తక్కువ కరోనా కేసులు నమోదవడంతో.. ఆ ప్రతిపాదనని తిరస్కరించాం. కానీ.. కేవలం మూడు వారాల వ్యవధిలోనే కేసులు ఊహించనిరీతిలో పెరిగిపోయాయి’అని గంగూలీ పేర్కొన్నాడు. అలాగే బయోబబుల్‌లో వైరస్ ఎంట్రీ ఇలా ఇచ్చిందనే విషయాన్ని చెప్పడం చాలా కష్టమని సౌరవ్ గంగూలీ తెలిపాడు.
previous post
రాజధాని పేరుతో రైతులను ముంచారు: మంత్రి బొత్స