telugu navyamedia
సినిమా వార్తలు

ఎయిర్ పోర్టులో భద్రతపై సూపర్ స్టార్ కూతురు ఫైర్

Soundarya-Rajinikanth

ఫిబ్ర‌వ‌రి 11న చెన్నైలోని లీలా ప్యాలెస్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చిన్న కూతురు సౌంద‌ర్యతో ప్ర‌ముఖ బిజినెస్‌మెన్ విశాగన్ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే సౌంద‌ర్య‌ త‌న భ‌ర్త‌తో విశాగ‌ణ్‌తో క‌లిసి సెప్టెంబ‌ర్ 1న లండ‌న్ వెళ్ళారు. లండ‌న్‌లోని హెత్రో ఎయిర్ పోర్ట్‌కి చేరుకోగా, ఇమ్మిగ్రేష‌న్ స‌మ‌యంలో విశాగ‌ణ్ త‌న పాస్ పోర్ట్‌తో పాటు అమెరిక‌న్ డాల‌ర్స్‌తో కూడిన సూట్‌కేసు మిస్ అయిన‌ విష‌యాన్ని గ్ర‌హించాడు. దీంతో విశాగన్ వెంట‌నే విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేసారు. భారత రాయబార కార్యాలయం వెంట‌నే స్పందించి విశాగణ్‌ కోసం డూప్లికేట్ పాస్ పోర్ట్ జారీ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ ఘటన అనంతరం సౌందర్య తన భర్తతో కలిసి లండన్ నుంచి చెన్నై వచ్చేసినట్లు స‌మాచారం. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో భ‌ద్ర‌త ఎలా ఉంది అనే దానిపై సౌంద‌ర్య ర‌జనీకాంత్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డింది. “అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్స్‌లో ప్రయాణికులకు ఎంతటి భద్రత ఉంది. లండన్‌లోని హెత్రో ఎయిర్‌పోర్ట్‌లో మా సామాన్లు, పాస్‌పోర్ట్ పోయాయి. దాంతో వెంటనే లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఏం జరిగిందో కనుక్కుని ఈమెయిల్ ద్వారా ఏ విషయం అన్నది చెప్తామని పోలీసులు తెలిపారు. కాసేపటి తర్వాత వారి నుంచి నాకు మెయిల్ వచ్చింది. దోపిడీ జరిగిన సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదని దాంతో అక్కడ జరిగినవేవీ రికార్డ్‌ అవ్వలేదని చెప్పారు. ఇది నిజంగా షాకింగ్ ఘటన. ఎయిర్‌పోర్ట్ అధికారులు కాస్తంత బాధ్యత కూడా లేకుండా వ్యవహరిస్తారని నేను అనుకోలేదు. ఎయిర్‌పోర్ట్స్‌లో సేఫ్టీ అనేది ఎక్కడ ఉంది? మాకు జరిగిన ఘటనలకు ఎయిర్‌పోర్ట్ సిబ్బందే బాధ్యులు. మాకు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. మాకే కాదు మరెవ్వరికీ ఇలాంటి అనుభవాలు ఎదురుకాకూడదు” అని సౌంద‌ర్య‌ పేర్కొన్నారు.

Related posts