telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

విదేశీ పర్యనలు రద్దు చేయాలి.. మోదీకి సోనియా పలు సూచనలు

soniya gandhi

కరోనాపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో తగు సూచనలు  ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఈ మేరకు మోదీకి ఆమె ఓ లేఖ రాశారు. ప్రభుత్వ యాడ్స్ రెండేళ్ల పాటు పూర్తిగా రద్దు చేయాలని తెలిపారు. ఢిల్లీలో రూ.20 వేల కోట్లతో చేపడుతున్న ‘సెంట్రల్ విస్టా’ సుందరీకరణ కన్ స్ట్రక్షన్ ప్రాజెక్టు పనులను వెంటనే రద్దు చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ప్రభుత్వ ఉన్నతాధికారుల విదేశీ పర్యటనలు రద్దు చేయాలని సూచించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో టీవీ, ప్రింట్, ఆన్ లైన్ మీడియా కు ప్రభుత్వం తరఫున ఇచ్చే యాడ్స్ ను రెండేళ్ల పాటు పూర్తిగా రద్దు చేయాలని సూచించిన సోనియా, ‘కరోనా’ మహమ్మారి కట్టడి నిమిత్తం ఇచ్చే ప్రకటనలు మాత్రం ఇవ్వాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ.1,250 కోట్ల చొప్పున మీడియా అడ్వర్టైజ్ మెంట్లకు ఖర్చు చేస్తుందని అన్నారు. ఈ ఖర్చును తగ్గించడం ద్వారా ‘కోవిడ్-19’ ప్రభావం వల్ల పడ్డ ఆర్థిక, సామాజిక ప్రభావాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని సూచించారు. ఈ సందర్భంగా ‘పీఎం కేర్స్ ఫండ్’ గురించి ఆమె ప్రస్తావించారు. ఈ ఫండ్ కు వచ్చిన విరాళాల మొత్తాన్ని పీఎం రిలీఫ్ ఫండ్ కు తరలించాలని లేఖలో సోనియా పేర్కొన్నారు.

Related posts