telugu navyamedia
సినిమా వార్తలు

“లాల్ కప్తాన్” నుంచి సోనాక్షి లుక్

Sonakshi

న‌వదీప్ సింగ్ దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ చిత్రం “లాల్ కప్తాన్”. 18వ శతాబ్దంలో ఓ బ్రిటీష్‌ కెప్టెన్‌పై పోరాడిన నాగసాధువు కథ ఆధారంగా చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో సైఫ్ నాగ సాధు గెటప్‌లో కనిపించనున్నారు. ఇలాంటి పాత్రలో సైఫ్ నటించడం ఇదే తొలిసారి. మానవ్ విజ్, జోయా హుస్సేన్, దీపిక్ డోబ్రియల్, సిమోన్ సింగ్ కీలక పాత్రలలో క‌నిపించ‌నున్నారు. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 18న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇటీవ‌ల లాల్ క‌ప్తాన్ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులో సైఫ్‌ ముఖానికి బూడిద, నుదుటిపై నామంతో స‌రికొత్త‌గా క‌నిపించారు .‘మనిషి పుట్టినప్పుడే అతని మరణం గురించి పైవాడు రాసేసి ఉంటాడు’ అన్న డైలాగ్ చెప్తూ మనుషుల్ని దారుణంగా చంపి, గుర్రానికి కట్టి ఈడ్చుకెళుతున్నట్లుగా సైఫ్ ఇందులో కనిపించారు. ట్రైల‌ర్ ఆస‌క్తి రేకెత్తించింది. ఇక సోనాక్షి సిన్హా అతిథి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా సోనాక్షి సిన్హా లుక్ విడుద‌ల‌ చేశారు చిత్రబృందం. చిత్ర షూటింగ్ లో ఆమె పార్ట్ షూటింగ్ పూర్తి కావ‌డంతో సోనాక్షి లుక్ ను విడుదల చేశారు. పోస్ట‌ర్‌లో సోనాక్షి లుక్ ఆకట్టుకుంటోంది.

Related posts