somavaram-as-polavaram-by-chandrababu

పోలవరం పూర్తి చేయడమే నాజీవిత ఆశయం – చంద్రబాబు

20

ప్రతి సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ ను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు కూడా పోలవరాన్ని సమీక్షించి ఆయా పనులను చేసి, ప్రాజెక్ట్ ను అనుకున్న సమయానికల్లా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని బాబు అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పోలవరం ఎడమ కాలవను డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం అని అన్నారు. ఎవరెన్ని సమస్యలు సృష్టించినా పోలవరం పూర్తిచేస్తాం అన్నారు. పోలవరం పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందన్నారు. వంశధార, కృష్ణ, నాగావళి, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం అన్నారు. 2 కోట్ల ఎకరాలకు నీళ్లు అందించడమే తన లక్ష్యం అన్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ కి ఏలేరుకు నీళ్లు విడుదల చేస్తాం అన్నారు, హంద్రీనీవా కూడా పూర్తిచేసి తీరుతామన్నారు. మర్చి కల్లా ఉత్తరాంధ్ర సుజలస్రవంతి కూడా నీళ్లు విడుదల చేస్తాం అన్నారు. పోలవరం ను పూర్తి చేయడమే తన జీవిత ఆశయం అని చంద్రబాబు అన్నారు.