Y s jagan praja sankalpa yatr

జగన్ కు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల సంఘీభావం

60

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని శనివారం చింతపల్లిలో బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నతెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏపీ ప్రత్యక హోదాకోసం పోరాటం చేస్తున్నది వైఎస్సార్‌సీపీ అని వారన్నారు. రాజీనామా చేసిన ఆ పార్టీ ఎంపీలను కొనియాడారు కొనియాడారు.
ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడిన నాయకుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. తాము బెంగూళూరులో ఉద్యోగాలు చేస్తున్నా ఏపీలో జరుగుతున్న రాజకీయాలను గమనిస్తున్నామని తెలిపారు. ప్రత్యక హోదా కోసం చేస్తున్న కార్యక్రమాలను సోషల్ మీడియా లో పోస్టు చేస్తున్నామని తెలిపారు. రాస్ష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏపీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, గ్రామాల్లోమౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.