telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సత్యవతి .. స్వచ్ఛ భారత్‌ కోసం .. అలుపెరగని కృషి..

social worker satyavati swatchh barat

‘స్వచ్ఛ భారత్‌’ను ప్రధాని మోదీ తీసుకువచ్చి ఇప్పటికి 5 సంవత్సరాలు గడుస్తున్నా.. ఎక్కడా ఎలాంటి.. పురోగతి కనిపించడం లేదు. మొదటలో.. సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, పలువురు నానా హంగామా చేసారే తప్పించి.. ఆచరణలోకి తీసుకురాలేదు. ఎవరేం చెప్తే ఏంముంది.. మనలో కూడా.. స్వచ్చంగా.. పని చేయాలనే బుద్ధి వుంటే.. మన ఇంటి చుట్టు పరిసరాలే కాదు.. మన దేశ రూపునే మార్చేయచ్చు. అలాంటి కొందరికి ఆదర్శంగా నిలుస్తోంది.. సత్యవతి. కామారెడ్డి పట్టణంలో.. సత్యవతి అనే పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ఆమె.. నిరంతరం చెత్త సమస్యపై పోరాడుతూ ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయాలంటే.. ఆమెను చూసి.. ప్రజలు భయపడుతూంటారు. అంతాగా.. ఆమె చెత్తపై యుద్ధం చేస్తోంది. అంతేకాకుండా.. మున్సిపల్, ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టరేట్ ఆఫీస్‌ల చూట్టూ చెత్త నిర్మూలనకు వినతి పత్రాలు అందిస్తూ ఉంటోంది. అధికారులే కాకుండా.. ప్రజా ప్రతినిధులు కూడా కలిసి చెత్తపై పోరాటం చేయాలంటూ చెప్తుంటుంది. కాగా.. ఈ మధ్యకాలంలో.. సత్యవతి చేసిన పనికి.. అందరూ పొగడ్తలతో ముంచెత్తున్నారు. చెత్త సమస్యకు.. తమ కాలనీలో చెత్త బండీలు క్రమం తప్పకుండా నడపాలని, అలాగే.. రోడ్లపై.. కూడళ్ల వద్ద ఎవ్వరూ చెత్త వేయకుండా చూసే బాధ్యత నాదంటూ.. శబథం పూనింది. కూడళ్ల వద్ద చెత్త వేస్తే.. 50 రుపాయాల జరిమానా విధిస్తామంటూ.. ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా.. తన వంతు ప్రయత్నంగా.. కూడళ్ల వద్ద కాపుకాస్తూ.. చెత్తవేసిన వారిపై శివం ఎత్తుతోంది. దీంతో.. కాలనీ వాసులు అమ్మో.. సత్యవతమ్మ అని భయపడేంతగా.. అందరూ బెదరిపోయి.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం మానేశారు.

ఏడుపదుల వయసున్నా.. పరిశ్రభతను పాటించడంలో.. మొదటిగా నిలుస్తోంది. భువనగిరి నుచి 1975లో కామెరెడ్డికి వలస వచ్చిన సత్యవతి కుటుంబం. కొన్నాళ్లు ప్రైవేటు పాఠశాలను నడిపింది. ఆ తరువాత 1985లో పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైంది. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంది సత్యవతి. నిరంతరం పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే.. పారిశుద్ధ్యంపై అధికారులకు పలు ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయినా.. పట్టువదలని విక్రమార్కుడిలా.. తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే వచ్చింది. చెత్త నిర్మూలన.. కేవలం అధికారుల బాధ్యతనే కాకుండా.. మనది కూడా ఉందని.. కాలనీలోని ప్రజలకు ప్రచారం చేస్తుండేది. అయినా.. కొందరు పట్టించుకోకపోవడంతో.. తానే సొంత డబ్బులతో.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. చెత్తవేసిన చోట స్వయంగా శుభ్రం చేసేది. కానీ తమ పొరపాటును.. సత్యవతమ్మ కష్టాన్ని గుర్తించిన కాలనీ వాసులు.. తామే స్వయంగా.. పారిశుద్ధ్యానికి కృషి చేస్తున్నారు.

ఏదేమైనా.. మార్పు అనేది.. ఇతరులలో చూడటమే కాకుండా.. మనలో కూడా వస్తేనే దాని పూర్తి ఫలితాలు ఎంత చక్కగా ఉంటాయో చూడగలం. అందుకు తనవంతు అడుగు ముందుకు వేసిన సత్యవతికి జోహార్లు. భారతదేశంలో పుట్టగానే భారతీయులు అవచ్చేమో, అయితే అందుకు మన మనసాక్షి ఒప్పుకుంటుందా.. అని అందరూ ఒక్కసారి స్వీయ పరిశీలన చేసుకుంటే.. కేవలం స్వచ్ఛభారత్ అంటూ .. కోట్లతో ప్రచారం అవసరం ఉండదు. ఇటువంటివే ఖజానకి చిల్లులుగా మిగిలిపోతాయి.

Related posts