social media effects on womens

చదువుకున్న వారి కంటే చాకలోడే మేలు… అనేది ఇందుకే..

53
హైద్రాబాద్ లో మరో ఘాతుకం వెలుగు చూసింది. మనం రోజు చూస్తేనే ఉన్న సోషల్ మీడియా వల్ల జరిగే మోసాలు  పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా సమాజంలో ఎటువంటి మార్పు రావడం లేదు. సైబర్ నేరగాళ్లు రోజు రోజు కు ఎక్కువ అవుతున్నారు.  తాజాగా హైదరాబాద్ లో సిక్కిం గ్రామంలో ఉండే ఉపేంద్ర వర్మ పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. మయూర్ పాన్ షాప్ పేరిట హిమాయత్ నగర్ తో పాటు హైద్రాబాద్ లో పలు ప్రాంతాలలో పాన్ షాప్ నిర్వహిస్తునాడు. పేస్ బుక్ ద్వారా ఓ మిత్ర మండలి పేరిట సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. మిత్రమండలి అని ఉండడంతో సేవా భావం ఉన్నవాడనుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించారు ఆ ఉద్యోగి. 
 
కాచిగూడ లో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ యువతీని మెల్లిగా మాయమాటలు చేపి దగ్గరయ్యాడు, అంతే కాకుండా తన బిజినెస్ సామ్రాజ్యం గురించి చెప్పి యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీనితో ఆ యువతి ఉపేంద్ర వర్మ చేపిందల్లా చేసింది. యువతి తన వలలో చిక్కిందని నిర్ధారించుకున్న ఉపేంద్ర వర్మ అమ్మాయితో కలసి పార్కులు హోటల్ లు చుట్టూ తీరిగారు. తన పాన్ మహల్ లో ప్రత్యేకంగా చేపించినవి అంటూ స్వీట్ పాన్ లు తినిపించాడు.
 
పాన్ లో మత్తు పదార్థాలు కలిపి యువతి సృహ కోల్పోగానే హత్యాచారం చేశాడు. అలా అనేకసార్లు యువతీ పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి కూడా మౌనంగా ఉండిపోయింది. నెలలు గడుస్తుండంతో యువతి పెళ్లి విషయం పై నిలదీసింది, అప్పటిదాకా అతని లో ఉన్న ఇంకో కోణం తెలీలేదు, అతనకి ఇంతక ముందే  రాజస్థాన్ యువతితో పెళ్లి అయిందని పాప కూడా ఉందని చెప్పాడు.  దీనితో ఆ యువతి కి ఒక్కసారిగా గుండె బద్దలయ్యింది, మంచి వాడని నమ్మిన పాపానికి ఆ దుర్మార్గుడు తన జీవితం నాశనం చేశాడని తెలుసుకుంది. విషయాన్ని ఇంట్లో తల్లితండ్రులకు చెప్పింది. యువతి  తల్లితండ్రులు  ఉపేంద్రను నిలతీయడంతో మాట మార్చాడు, తనకు ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్లు బలవంతంగా రాజస్థాన్ అమ్మాయి తో పెళ్లి చేశారని చెప్పాడు. కొద్దీ రోజులు ఆగితే భార్యకి విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. చివరకు యువతి వత్తిడ్లు వల్ల గత ఏడాది  పెళ్లి చేసుకున్న ఉపేంద్ర వర్మ గోవా కి తీసుకెళ్లాడు, అక్కడ స్నేహితుల సమక్షం లో అసహ్యంగా ప్రవర్తించాడు. అయినా మౌనంగా భరించింది ఆ అమ్మాయి, కానీ రోజు రోజు కు వేధింపులు ఎక్కువ  కావడంతో అతని స్నేహితులు కూడా  వేధిస్తుండడంతో పోలీసులను ఆశ్రయించింది. ఆ దుర్మార్గుడు చిత్రీకరించిన వీడియోలు, చిత్రాలు, మెసేజీలు ఆధారంగా బాధితురాలు కాచికూడా పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చెయ్యాలని యువతి పిర్యాదు చేసింది. దీనితో ఉపేంద్ర వర్మ పై పలు కేసులు కింద కేసు నమోదు చేశారు, అతనిని అరెస్ట్ చేసి  రిమాండ్ కి పంపారు. ఉపేంద్ర వర్మకి సహాయం చేసిన గోషా మహల్ కి చెందిన ఫర్నిచర్ వ్యాపారి రాజేష్ పరారీలో ఉన్నాడు.