telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కొండచిలువకు .. ఆహారమైన ముసలి.. ఒక్క గుట్కకే..

snake eaten crocodile in

కొండ చిలువ .. ఏకంగా ఓ మొసలినే గుటుక్కున మింగేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో చోటు చేసుకున్నది. ఆ కొండ చిలువ మామూలు కొండ చిలువ కాదట. దాన్ని ఆలివ్ పైథాన్ అంటారట. ఆస్ట్రేలియాలోని పొడవైన పాముల్లో రెండోదట. కొలను వద్ద సేద తీరుతున్న మొసలిని కనిపెట్టిన ఆ కొండచిలువ.. దాని దగ్గరికి వెళ్లి లటక్కున పట్టేసుకొని మింగేసింది. నిజానికి కొండ చిలువల నోరు చూడటానికి చిన్నగానే ఉన్నా.. వాటి ద‌వ‌డ‌ల‌కు సాగే గుణం ఉంటుంది.

ఆ గుణం వల్ల వాటికన్నా పెద్ద జంతువులను కూడా లటక్కున మింగేయగలవు అవి. ఒక్కోసారి మనుషులను కూడా లాగించేస్తాయి. ఇక.. ఈ ఆలివ్ పైథాన్‌లు.. 13 అడుగుల పొడవు వరకు పెరుగుతాయట. కొండచిలువ.. మొసలిని తినేస్తుండగా..మార్టిన్ ముల్లర్ అనే వ్యక్తి ఫోటోలు తీయగా.. వాటిని ఆస్ట్రేలియాకు చెందిన ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ జీజీ వైల్డ్ లైఫ్ రెస్క్యూ.. తమ ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

Related posts