smell at rainy day is from

ఆ వాసన మట్టిది కాదు…తెలుసా..?

237

వేసవి తాపం తీరిపోయి వానా కాలం వచ్చేసింది. తొలకరి జల్లు తో అందరు వేసవి వేడిని మరిచిపోయి చల్లటి వాతావరణం లోని హాయిని ఆస్వాదిస్తున్నారు. తొలకరి జల్లు పడగానే ముందుగా భూమి నుండి ఓ విధమైన సువాసన వస్తుంది. అది వర్షపు జల్లు పడగానే ఒక పక్క చల్లదనం మరో పక్క ఆ మట్టి వాసన, ఈరెండు మనసును కట్టి పడేస్తాయి. ఆ జల్లుల్లోన్నే తడుస్తూ ఆడేవారు, ఆ జల్లుల్లో రకరకాల చిరుతిళ్ళు తయారు చేసుకొని వేడివేడిగా ఆస్వాదించే వారు…ఇలా ఆ వాతావరణాన్ని ఒకొక్కరు ఒక్కోవిధంగా ఆస్వాదిస్తుంటారు.

smell at rainy day is 2అయితే ఈ తొలకరి జల్లు పడ్డప్పుడు వచ్చే మట్టి సువాసన ఆ మట్టిది కాదట, ఆ ప్రాంతంలో భూమిలో నివాసం ఉంటున్న కొన్ని జీవరాసుల జీవక్రియ వల్ల మనకు అలాంటి వాసన వస్తుందట. మనకు తెలిసిందే కదా భూమిలో కూడా వేల ప్రాణులు ఆవాసం ఏర్పాటు చేసుకొని వాటి వాటి జీవనాన్ని కొనసాగిస్తాయి, అటువంటి ఓ జీవి వల్ల తొలకరి జల్లు పడగానే మనకు మట్టి ఓ వాసన రావటం జరుగుతుందట.

smell at rainy day is fromభూమిలో నివసించే ఆక్తినో సైనో అనే బాక్టీరియా వల్ల మనకు వర్షం పడప్పుడు భూమి నుండి మనకు వాసనలు వస్తాయట. ఆ బాక్టీరియా భూమిలో గుడ్లు పెట్టి ఉంటాయి వేసవిలో, వాటిని చినుకు తాకగానే వాటిల్లోని జియాస్మిన్ అనే పదార్థం ఒక రకమైన వాసనను వెదజల్లుతుంది. అదే మనము ఎంత బాగుందో…అంటూ ఆస్వాదిస్తుంటాం.

smell at rainy day is from4

భూమిలో కూడా మేలు చేసే వి ఉంటాయి, కీడు చేసేవి ఉంటాయి. ఎలాగైతే మన శరీరంలో మేలు చేసే బాక్టీరియా రోగాలతో పోరాడుతూ ఉంటుందో అలాగే భూమిలో ఉన్నవి పంట ఆరోగ్యంగా పెరిగేందుకు తోడ్పడుతాయి. తద్వారా పంట ఉత్పత్తి పెరిగి రైతుకు మేలు జరుగుతుంది, అవే దుకాణాలలో కొని వినియోగదారులు వారి అవసరాలను తీర్చుకుంటున్నారు.