telugu navyamedia
ఆరోగ్యం

ఉదయం అల్పాహారం మానేస్తున్నారా?

రాత్రివేళ చాలామంది ఆలస్యంగా నిద్రిస్తుంటారు. దీంతో అధిక శాతం మంది టిఫిన్ మానేస్తారు.

అయితే ఇలా టిఫిన్ మానేయడంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఉండటంవల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఉదయం అల్పాహారం తీసుకోనప్పుడు శక్తి కోసం పగటిపూట ఎక్కువ కొవ్వు, చక్కెర పదార్థాలను తినాలనే కోరిక పెరుగుతుంది. దీనివల్ల బరువు పెరుగుతారు.

టిఫిన్ మానేయడంవల్ల బరువు తగ్గే బదులు బరువు పెరుగుతారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడంవల్ల ఊబకాయం, రక్తపోటు, మధుమేహం రావడానికి అవకాశం ఉంది.

టిఫిన్ తీసుకోకపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో పోషకాల లోపం వల్ల వచ్చే వ్యాధులు వస్తాయి.

రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోయి శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి.

అధిక మొత్తంలో ఒత్తిడి హార్మోన్ల కారణంగా మానసిక స్థితి క్షీణిస్తుంది. దీనివల్ల చికాకు కలుగుతుంటుంది. కోపం పెరుగుతుంది. ఇదంతా అనారోగ్యానికి దారితీస్తుంది.

శరీరం బలహీనంగా అనిపిస్తుంది. శక్తి లేకపోవడం వల్ల మీరు రోజంతా అలసిపోతారు.

ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. బ్రేక్ ఫాస్ట్ ను మానేయడంవల్ల లేదంటే కావాలని తినకుండా ఉండటంవల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.

తద్వారా అనేక రకాల వ్యాధులు శరీరాన్ని చుట్టుముడతాయి. క్రమంగా గుండెకు సంబంధించిన వ్యవస్థ బలహీనపడుతూ వచ్చి శరీరాన్ని తీవ్ర రోగాలపాలిట పడేలా చేస్తుంది.

ఎట్టి పరిస్థితుల్లోను బ్రేక్ ఫాస్ట్ ను మానేయకూడదని, సాధ్యమైనన్ని పోషకాలతో అధికంగా తీసుకునేందుకే ఆసక్తి చూపించాలి.

Related posts