telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎస్సీ నిరుద్యోగ యువతకు .. ఉచిత నైపుణ్య శిక్షణ ..

skill training to sc unemployed

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాన్యానాయక్ నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. టీఎంఐసీ 2ఈ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా పలు కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నామన్నారు. 18 -35 ఏండ్ల లోపు అభ్యర్థులు కులం, ఆధార్, ఆదాయం, విద్యార్హత సర్టిఫికెట్లను జతపరిచి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సెప్టెంబర్ 16 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా పిక్కర్ అండ్ ప్యాకర్, కొరియర్ డెలివరీ ఎగ్జిగ్యూటివ్ కోర్సులో చేరేందుకు ఎస్సెస్సీ పాస్, డీటీహెచ్ ఇన్‌స్టాలేషన్, ఏసీ టెక్నీషన్ కోర్సులకు ఎస్సెస్సీ పాస్ / ఫేయిల్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Related posts