telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు సామాజిక

బీసీ నిరుద్యోగులకు డాట్‌నెట్ లో ఉచిత శిక్షణ

Skill training for BC unemployed

విద్యావంతులైన బీసీ నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించనుంది. ఉచిత వసతి, శిక్షణనివ్వడమే కాకుండా, శిక్షణ ముగిసిన తర్వాత ప్లేస్‌మెంట్‌ను కల్పించనున్నారు. హైదరాబాద్ జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులయిన యువతీ యువతకు డెంటల్ అసిస్టెంట్, డాట్‌నెట్, ఇండస్ట్రీయల్ ఆటోమేషన్ కోర్సుల్లో 3 మాసాల పాటు శిక్షణ నివ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారి తెలిపారు. బీసీ కులాలకు చెంది వార్షికాదా యం రూ. 2 లక్షలకు మించని వారు తమ ధృవీకరణ పత్రాలతో మార్చి 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం సైదాబాద్‌లోని టీఎస్‌బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్, ఇంటి నెంబర్ 17-1-388/L/3 లక్ష్మీనగర్‌కాలనీ, రోడ్‌నెంబర్‌లో 040 -24071178 నెంబర్‌ను లేదంటే bcstudy circle_hyd<\@>yahoo.co.in సంప్రదించాలన్నారు.

Related posts