sketch to murder modi like rajivgandhi

మోదీని చంపేందుకు కుట్ర!

27

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని ఎల్టీటీఈ హతమార్చిన తరహాలోనే మావోయిస్టులు ప్రధాని మోదీని చంపేందుకు ప్లాన్‌ చేశారని పుణే పోలీసులు తెలుపడం సర్వత్రా చర్చగా మారింది. అందుకు సంబంధించిన ఓ లేఖను శుక్రవారం పోలీసులు విడుదల చేశారు. 2018 జనవరి మహారాష్ట్రలోని భీమా కోరేగాంలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో సుధీర్‌ దావలే, సురేంద్ర గాట్లింగ్‌, సోమా సేన్‌, మహేష్‌ రౌత్‌, రోనా జాకబ్‌ విల్సన్‌ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే జాకబ్‌ విల్సన్‌ను అరెస్ట్‌ చేసిన ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది. మోదీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం లేఖలో స్పష్టంగా ఉంది.

మోదీ నేతృత్వంలోని భాజపా 15కుపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఇది ఇలాగే కొనసాగితే మావోయిస్టు పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని అంతమొదించేందుకు కొందరు సీనియర్‌ కామ్రేడ్లు కఠినమైన చర్యలను ప్రతిపాదించారు. రాజీవ్‌ గాంధీ హత్య తరహాలో పథకానికి ఆలోచిస్తున్నాం. బహిరంగ సభలు, రోడ్‌షోల్లో ఇటువంటి చర్యలకు పూనుకోవచ్చు. ఒకవేళ ఈ పథకం విఫలమైనా.. పార్టీని బతికించుకోవడమే ఏకైక లక్ష్యంగా నిర్ణయం తీసుకోవాలి’ అని లేఖలో ఉంది.

ఇంతకీ కుట్ర జరిగిందా…అధికారం కోసం రాజకీయ ఎత్తా…అనే విమర్శలు కూడా ఈ ఘటనపై లేకపోలేదు.