telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాడు కనిపిస్తే పళ్ళు రాలిపోతాయ్… సింగర్ సునీత ఫైర్

singer sunitha

ప్రముఖ సింగర్ సునీత మేనల్లుడిని అని చెప్పుకుంటూ చైతన్య అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతుండటం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియా స్పందించిన సునీత ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘‘నేను ఓ ముఖ్యమైన విషయంపై క్లారిటీ ఇవ్వాలని మీ ముందుకొచ్చాను. చైతన్య అనే అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి నా మేనల్లుడు అని చెప్పి మోసాలకు పాల్పడుతున్నాడని తెలిసింది. చాలామంది సెలబ్రిటీలతో కూడా నా పేరు చెప్పి పరిచయాలు పెంచుకుంటున్నాడట. అలాగే అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర డబ్బులు కాజేస్తున్నాడని తెలిసింది. ఈ విషయం తెలిసి నేను షాకయ్యాను. చైతన్య అనే వాడెవడో కూడా నాకు తెలియదు. వాడి మాటలు నమ్మి మోసపోకండి. ఎవ్వరూ మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నా. సెలబ్రిటీకి చుట్టం అని చెప్పగానే వారికి డబ్బులిచ్చి ఎలా మోసపోతున్నారు. కొంచమైనా ఆలోచించాలి కదా!. ఇకనైనా బయటి వ్యక్తులు ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే జాగ్రత్తగా ఉండండి. దయచేసి డబ్బులు పోగోట్టుకోవద్దు. ఆ చైతన్య అనే వ్యక్తి ఎవడో నాకు తెలియదు. వాడు కనిపిస్తే పళ్ళు రాలిపోతాయ్! పోలీస్ కంప్లైంట్ చేస్తా.. వాడిని వదలను’’ అని పేర్కొంటూ ఫైర్ అయింది సునీత.

Related posts