telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

చైనా ఓపెన్‌లో … తడబడిన .. సింధు, సైనా నెహ్వాల్‌..

sindhu and saina nehwal out from china open

ఇటీవల ముగిసిన చైనా ఓపెన్‌లో భారత టాప్‌ షట్లర్లు పివి సింధు, సైనా నెహ్వాల్‌లకు మరోసారి కనీసం క్వార్టర్‌ఫైనల్‌కు చేరలేకపోయారు. తాజాగా కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 టోర్నీలో తొలి రౌండ్‌లోనే అనూహ్య పరాజయాలను చవిచూశారు. తొలిరౌండ్‌ పోటీలో సింధు చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్‌ జాంగ్‌ చేతిలో 7-21, 24-22, 21-15 తేడాతో ఓడిపోయి ఇంటిబాట పట్టింది.

ఇటీవలే జరిగిన ప్రపంచ చాంపియన్‌లో బీవెన్‌ జాంగ్‌పై సునాయసంగా గెలిచిన సింధు నేటి మ్యాచ్‌లో మాత్రం పోరాడి ఓడింది. తొలిసెట్‌ను సునాయాసంగా గెల్చుకున్న సింధు రెండోసెట్‌లో బీవెన్‌ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదుర్కొంది. పోటాపోటీగా సాగిన ఈ సెట్‌ను చేతులారా చేజార్చుకోవడంతో సింధు ఒత్తిడికి గురైంది. నిర్ణయాత్మక మూడోసెట్‌లోనూ కొంత ప్రతిఘటించినా జంగ్‌ముందు నిలువలేకపోయింది. ఇక 8వ సీడ్‌ సైనా నెహ్వాల్‌ 21-19, 18-21, 1-8తో కిమ్‌-జి-యున్‌(కొరియా) చేతిలో పరాజయం పాలైంది. ఇరువురు షట్లర్లు ఒక్కోసెట్‌ గెల్చుకున్న తర్వాత మూడోసెట్‌లో సైనా గాయపడింది. 8-1 పాయింట్ల ఆధిక్యతలో కిమ్‌ ఉన్న దశలో గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సైనా మ్యాచ్‌ మధ్యలోనే అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది.

పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌ రెండోరౌండ్‌లోకి ప్రవేశించాడు. తొలిరౌండ్‌ పోరులో కశ్యప్‌ 21-16, 21-16 పాయింట్ల తేడాతో లూ-ఛియా-హంగ్‌(చైనీస్‌ తైపీ)పై సునాయాసంగా గెలుపొందాడు. మరో పోటీలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సాయిప్రణీత్‌ తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. డెన్మార్క్‌కు చెందిన 5వ సీడ్‌ ఆంటోన్సెన్‌ చేతిలో 21-9, 11-7తో ఓడాడు. తొలి సెట్‌ను కోల్పోయిన ప్రణీత్‌.. రెండో సెట్‌లో గాయపడ్డాడు. దీంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతొ కొరియా ఓపెన్‌లో సింధు, సాయి ప్రణీత్‌ల ప్రయాణం ముగిసింది. ఇక పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమిత్‌రెడ్డి జోడీ 16-21, 21-19, 18-21తో చైనా జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు. మరో డబుల్స్‌ జోడీ రంకిరెడ్డి-చిరాగ్‌శెట్టి జోడీ 19-21, 21-18, 18-21తో కొరియా జోడీ చేతిలో ఓడారు.

Related posts