telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైభవంగా సింహాద్రి అప్ప‌న్నచందనోత్సవం..

విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న చందనోత్సవం వైభవంగా జరుగుతోంది. కొండపై స్వామివారి చందనోత్సవంకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. సాయంత్రం వరకు రెండు లక్షల మంది స్వామివారి దర్శనానికి వస్తారని అంచనా వేశారు అధికారులు. . వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు

చందనోత్సవంలో ఇప్పటివరకు 25వేల మందికి దర్శనాలు కల్పించారు అధికారులు. సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతోంది. దేవస్థానంలోనే ఉండి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు కలెక్టర్ మల్లిఖార్జున, సిటీ పోలీసు కమిషనర్ శ్రీకాంత్ శ్రీకాంత్. 

అప్పన్న తొలి దర్శనాన్ని చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబం చందనం సమర్పించి దర్శనాన్ని చేసుకున్నారు. స్వామిని మరికొందరు మంత్రులు కూడా దర్శనం చేసుకున్నారు. స్వామిని దర్శించుకున్న మంత్రులు కొట్టు సత్యనారాయణ, అమర్నాథ్ దర్శించుకున్నారు.

Related posts