telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ స్టార్ పై సిద్దార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Siddharth

ఎన్నికల వేళ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేయడంతో భారీ హైప్ వచ్చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూపై కోలీవుడ్ నటుడు సిద్ధార్థ్ సెటైరికల్ గా ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ట్వీట్ లో అక్షయ్ ను విలన్ తో పోల్చుతూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు సిద్ధార్థ్. “అక్షయ్ కుమార్ ఒక విలన్.. ఆయన్ని తక్కువ అంచనా వేశాం” అంటూ ట్వీట్ చేశాడు సిద్ధార్థ్. అయితే తన కామెంట్ కి పూర్తి వివరణ ఇవ్వన్నప్పటికీ ప్రభుత్వ తీరుపై తన అసంతృప్తిని ఈ ట్వీట్ ద్వారా తెలియజేశారంటూ మోదీని వ్యతిరేకించే వర్గంవారు సిద్ధార్థ్ కి సపోర్ట్ చేస్తున్నారు. మరోపక్క దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మోదీని రెండోసారి ప్రధాని చేయడానికి అక్షయ్ కుమార్ తనవంతు సాయం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. మరికొందరు మోదీ అభిమానులు మోదీ ముందు అక్షయ్ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇంటర్వ్యూ చేయడంపై మండిపడుతున్నారు.

Related posts