నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నలేటెస్ట్ మూవీ’శ్యామ్ సింగ రాయ్’. కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా మరొక అప్డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘తార’ అనే మరో మెలోడి పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ లిరికల్ వీడియో లో షూటింగ్ సన్నివేశాలను, హీరో నాని, హీరోయిన్ కృతి శెట్టి ల పై చిత్రీకరించిన సన్నివేశాలను చూపించడం జరిగింది. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా యంగ్ సింగర్ కార్తీక్ ఆలపించాడు.
ఇక ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి చివరి పాట రాసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళి శర్మ, అభినవ్ గోమతం తదితరులు నటిస్తున్నారు.
రనూమండల్ పై హిమేష్ రేష్మియా ఘాటు వ్యాఖ్యలు