telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శృతి హాసన్ కు పెళ్లైంది… అందుకే లావైంది…!?

Shruti-Hassan

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇటీవల కాలంలో వెండి తెరపై సినిమాలు తగ్గించింది. ఇప్పుడిప్పుడే కొన్ని తమిళ, తెలుగు చిత్రాలకు సైన్ చేస్తోంది. “కాటమరాయుడు” చిత్రం తర్వాత సినిమాలను దూరం పెట్టిన శృతి హాసన్ కేవలం మ్యూజిక్ ఆల్బమ్స్ కి మాత్రమే పరిమితం అయింది. శృతి హాసన్ కాస్త బరువు కూడా పెరగడంతో అనేక రూమర్లు వినిపించాయి. ఆ సమయంలో తన మాజీ ప్రియుడు మైఖేల్ తో శృతి హాసన్ చెట్టాపట్టాలేసుకుని పబ్లిక్ గానే తిరిగింది. శృతి హాసన్, మైఖేల్ కొన్ని రోజుల క్రితమే విడిపోయారు. ఈ విషయాన్ని శృతి హాసన్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. తాజాగా శ్రుతి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తాను బరువెక్కిన సమయంలో ఎదుర్కొన్న విమర్శల గురించి వివరించింది. “శృతి హాసన్ కు పెళ్లైపోయింది.. అందుకే లావైంది’ అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ విని చాలా బాధపడ్డా. కానీ వాస్తవానికి నేను లావైంది అనారోగ్యం వల్ల. ఈ విషయం ప్రజలకు తెలియదు. నను తాను పట్టించుకునేంత తీరిక గత పదేళ్లలో లేదని.. ఇలాంటి పరిస్థితి ప్రతి వ్యక్తికీ వస్తుందన్నారు. ఇంత కాలం పాటు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని, కానీ ప్రస్తుతం తనను అవేమీ బాధించట్లేదని శ్రుతి తెలిపింది. తనకు కాస్త ప్రేమ, గౌరవం, ప్రశాంతత కావాలని పేర్కొంది.

Related posts