telugu navyamedia
ఆంధ్ర వార్తలు విద్యా వార్తలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గురుకులాల్లో 4600 పోస్టుల భర్తీ!

govt job notifications in andhrapradesh
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా 4600 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. నూతన జోనల్‌ విధానం మేరకు తెలంగాణ గురుకుల నియామక మండలి ఈ పోస్టులను భర్తీ చేయనుంది. రానున్న 2019-20 విద్యాసంవత్సరం నుంచి కొత్తగా అందుబాటులోకి రానున్న 119 బీసీ గురుకుల పాఠశాలల పరిధిలో ఈ పోస్టులున్నాయి. 
తొలివిడత కింద ఈ ఏడాదిలో కనీసం 1800 పీజీటీ, టీజీటీ పోస్టులు భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది విడుదల చేసిన ప్రకటనల మేరకు టీజీటీ, పీజీటీ పోస్టులు భర్తీ చేసిన వెంటనే కొత్తవాటికి ప్రకటన వెలువరించనుంది. గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాంతాలను ఖరారు చేయకపోవడంతో అద్దె భవనాలు గుర్తించేందుకు అడ్డుగా మారింది. అనుకూలమైన భవనాలు దొరక్కుంటే తరగతుల సంఖ్యను తగ్గించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts