అవును మరి! వీడు మహా ఫ్రాడ్! ఆడవాళ్లంటే ఏ మాత్రం గౌరవం లేదు. నియోజకవర్గంలో ఆఫ్ట్రాల్ ఒక మేయర్. నియోజకవర్గపు ప్రజాప్రతినిధికి కనీసం కుర్చీ కూడా వేయకుండా అవమానించిన సంస్కారం లేని మనిషి!
ఆ బలుపు చూపించిన రోజే ఆవేశ పడలేదు. పురపాలిక నిధులను పందికొక్కులెక్కన సొంత డబ్బులా భావించి, కుటుంబంతో కలిసి కంపెనీలు పెట్టి మరీ దోచుకున్నాడు. బాగా బలిసి కొవ్వు పట్టి, అహంకారంతో విర్రవీగాడు. చివరికి ఆ అవినీతే అతన్ని ఆ కుర్చీ నుంచి దింపేసింది. కర్మ అంటే ఇదేనేమో!
ఇక అసలు కథలోకి వస్తే..
కడప మేయర్‌కు షాక్! సురేష్‌బాబుపై అనర్హత వేటు!పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఏకంగా ఉత్తర్వులు జారీ చేశారు. కారణం ఏంటో తెలుసా? రూ.36 లక్షల అవినీతి!సొంత కుటుంబ సభ్యుల సంస్థతో కడపలో పనులు చేయించాడట! వర్ధిని కన్‌స్ట్రక్షన్ పేరుతో ఈ తతంగం నడిపించాడని ఆరోపణలు. నిన్న మున్సిపల్ శాఖ కార్యదర్శి ముందు విచారణకు హాజరయ్యాడు ఈ సురేష్‌బాబు. ఏం చెప్పాడో మరి!
విజిలెన్స్ అధికారులు తేల్చింది వింటే షాకవ్వాల్సిందే! కడప నగరంలో అభివృద్ధి పనులన్నీ తన ఇష్టం వచ్చినట్టుగా, తన కుటుంబానికి చెందిన గుత్తేదారు సంస్థ వర్ధిని కన్‌స్ట్రక్షన్ ద్వారా చేయించాడట ఈ మేయర్ గారు. మేయర్ పదవిని అడ్డం పెట్టుకొని సొంత వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టాడన్నమాట! ఇది చట్ట విరుద్ధమని తెలిసినా పట్టించుకోలేదు.
అసలు విషయం ఏంటంటే, మేయర్ పదవిలో ఉండి డైరెక్క్ట్‌గానో, ఇన్-డైరెక్ట్‌గానో సొంత కుటుంబ సభ్యులు గుత్తేదారు పనులు చేయకూడదు. ఈ విషయం మేయర్ దృష్టికి ఎవరైనా తీసుకెళ్లారా లేదా అని కూడా అధికారులు ఆరా తీశారు. ఎన్ని పనులు ఇంకా పూర్తి కాలేదో కూడా లెక్క తేల్చారు. ఈ గుత్తేదారు కంపెనీ డైరెక్టర్లుగా మేయర్ కొడుకు అమరేష్, భార్య జ్యోతి ఉన్నారట! అంటే అంతా కలిసి దోచుకున్నారన్నమాట!
పురపాలక చట్టం ప్రకారం ఇది పెద్ద తప్పు. అందుకే కమిషనర్ మనోజ్‌రెడ్డి గారు ఈయనను పదవి నుంచి తొలగించాలని రాతపూర్వకంగా సిఫార్సు చేశారు. అంతేకాదు, ఈ విషయాన్ని స్వయంగా మేయర్‌కు లేఖ రాసి మరీ చెప్పారు. మంగళవారం సురేష్‌బాబు మున్సిపల్ శాఖ కార్యదర్శి ముందు తన వివరణ ఇచ్చాడు. విజిలెన్స్ అధికారులు మాత్రం తమ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఈయనగారు 36 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. చిన్న మొత్తమే కదా అనుకుంటున్నారేమో! కానీ ఇది ప్రజల సొమ్ము!