telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

సెలబ్రిటీ మేనేజర్ అవుతాడా.. సోనూ సూద్ పై శివసేన విమర్శలు

sonu-sood

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో నటుడు సోనూ సూద్ వలస కార్మికులను ఆడుకున్నాడు. తన సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి వలసజీవులను వారి స్వస్థలాలకు చేర్చాడు. తన పెద్ద మనసుతో అందరి ప్రశంసలకు పాత్రుడయ్యాడు. కానీ, శివసేన మాత్రం సోనూ సూద్ పై విమర్శలు గుప్పించింది. కరోనా వేళ ‘కొత్త మహాత్ముడు’ ఊడిపడ్డాడని ఎద్దేవా చేసింది.

సోనూ సూద్ త్వరలోనే ప్రధానిని కలుస్తాడని, ముంబయి మహానగరానికి ‘సెలబ్రిటీ మేనేజర్’ అయిపోతాడని ఎద్దేవా చేసింది. శివసేన పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’లో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ విమర్శనాస్త్రాలు సంధించారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో సోనూ సూద్ అన్ని బస్సులను ఎలా తీసుకువచ్చారని రౌత్ ప్రశ్నించారు. కఠిన నిబంధనలు అమల్లో ఉండడంతో వలస కార్మికులను అనేక రాష్ట్రాల్లోకి అనుమతించలేదని తెలిపారు. మరి సోనూ సోద్ తరలించిన కార్మికులు ఎక్కడికి వెళ్లారో చెప్పాలని అన్నారు.

Related posts