ప్రస్తుతం మన దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నా మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వసూళ్ల వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖేష్ అంబానీ ఇంటివద్ద బాంబు బెదిరింపు కేసులో ఎన్ఐఏ కష్టడీలో ఉన్న వాజే రాసిన లేఖ సంచలనంగా మారింది. మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పోలీస్ అధికారి వాజేకు నెల నెల రూ.100 కోట్లు వసూళ్లు లక్ష్యంగా పెట్టారని మాజీ పోలీస్ అధికారి పరం బీర్ ఆరోపణలు చేశారు. ఆరోపణల నేపథ్యంలో వాజేను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అనిల్ దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే, అనిల్ దేశ్ ముఖ్ పై పరం బీర్ చేసిన ఆరోపణలు నిజమే అని వాజే తన లేఖలో పేర్కొన్నారు. మరో ఇద్దరు మంత్రులకు కూడా దీనితో సంబంధం ఉందని వాజే లేఖలో పేర్కొనడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొందరు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని కూల్చలేరని శివసేన ఎంపీ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
previous post
next post
జగన్ ప్రకటనతో హైదరాబాద్ లో రేట్లు పెరిగాయి: సీపీఐ నారాయణ