telugu navyamedia
Uncategorized

మహారాష్ట్రలో కొలిక్కిరాని ప్రభుత్వ ఏర్పాటు!

shivasena bjp

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఇంకా కొలిక్కిరానట్టు తెలుస్తోంది. బీజేపీతో శివసేనతో కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ సోమవారం నాడు రెండు పార్టీలు వేర్వేరుగా గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారిని కలవడానికి నిర్ణయించుకున్నాయి. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ బీజేపీ తో డిమాండ్ పెట్టిన శివసేన.. ఇంకా తన పట్టు వీడడం లేదు. వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన కోరుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం శివసేన నేత ఒకరు… గవర్నర్ భగత్‌సింగ్‌ కోష్యారితో సమావేశం అయ్యారు. మరోవైపు బీజేపీ కూడా గవర్నర్ ను కలవనుంది.

శివసేన నేత దివాకర్‌ రౌత్‌.. తమ పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ తరపున గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపామని చెప్పుకొచ్చారు. తమ మధ్య రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. కాసేపట్లో బీజేపీ నేతలు కూడా గవర్నర్‌తో సమావేశం అవుతారని తెలుస్తోంది. మర్యాద పూర్వకంగా గవర్నర్ ను కలుస్తున్నట్లు ఇరు పార్టీలూ చెప్పుకోవడం గమనార్హం.

Related posts