telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

హెయిర్ గ్రో కి.. ఇవే టిప్స్ అట.. : శిఖర్ ధావన్ తనయుడు..

shikar dawan with his son video viral

చాలా మందికి సెలెబ్రిటీలు వారివారి రోజును ఎలా గడుపుతారో తెలుసుకోవాలని; వారి జీవన విధానం ఎలా ఉంటుందనేది కూడా తెలుసుకోవాలని కుతూహలపడుతుంటారు. అది ఇప్పుడిప్పుడే సాకారం అవుతుంది వారికి.. ఇటీవల పెరిగిపోయిన సామజిక మాధ్యమాలతో ఇది సాధ్యపడుతుంది. సెలెబ్రిటీలు తమ జీవితాలలో జరిగిన కొన్ని సంఘటనలను, వీడియో తీసిమరీ సామజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. దానిని చూసి అభిమానులు సంతోషపడిపోతున్నారు, దానితో వారి కుతూహలానికి కూడా ఒక సమాధానం దొరికినట్టు అయ్యింది.

తాజాగా, టీమిండియా కాస్త విరామం దొరకడంతో తమ తమ కుటుంబాలతో సమయం గడుపుతున్నారు. ఎంత క్రికెటర్లయినప్పటికీ వాళ్లలోనూ భర్తలు, తండ్రులు ఉంటారు కదా. కాబట్టే ఉన్న సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా టీమిండియా ఆటగాడు శిఖర్‌ ధావన్‌ తన కొడుకుతో గడుపుతున్నప్పటి వీడియోను షేర్‌ చేశాడు.

ఈ వీడియోలో తన ముద్దుల కొడుకు జొరావర్‌ ధావన్‌ను భుజాల మీద ఎత్తుకున్నాడు, వాడేమో దాడికి హెయిర్ గ్రో టిప్స్ చెపుతున్నాడా.. అన్నట్టు ఉన్న ఈ వీడియోను ట్విటర్‌ వేదికగా శిఖర్ ధావన్ షేర్‌ చేశాడు. ఈ వీడియో వైరల్‌ అవుతోంది. అది మీరు కూడా చూసి, హెయిర్ టిప్స్ నేర్చుకోండి హా హా హా.

Related posts