sharmista mukharji on rss program

నేను ఎందుకు భయపడ్డానో, ఏమి చెప్పానో అదే జరిగింది : శర్మిష్ఠ ముఖర్జీ

43

నిన్నఆరెస్సెస్ కార్యక్రమం, బీజేపీ గురించి నేను చెప్పిందే జరిగింది అని శర్మిష్ఠ ముఖర్జీ అన్నారు. ప్రణబ్ ఆరెస్సెస్ కార్యక్రమం తర్వాత సామాజిక మాధ్యమాలలో ఒక ఫొటో చక్కర్లు కొట్టింది, అదేంటంటే ప్రణబ్ ముఖర్జీ వేదికపై ఆరెస్సెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఆరెస్సెస్ వందనం చేస్తున్న సందర్భంలో ప్రణబ్ కూడా అదేవిధంగా వందన సమర్పణ చేస్తున్నట్టు మార్చిన ఫోటో.

దీనిని ఉద్దేశించి శర్మిష్ఠ తాను నిన్న చేసిన వాక్యాలు బీజేపీ బృందం చేసే పనుల గురించి నేను బయపడింది, తండ్రికి విరుద్ధం మాట్లాడింది ఇందుకేనని నేను తెలిపినవి నిజమయ్యాయన్నారు, చిత్రాలను మార్చి వారు వారి చౌకబారుతనాన్ని మళ్ళీ ప్రదర్శించారు అని అన్నారు ఇలాంటి పనులు చేస్తారనే తన తండ్రి ప్రణబ్ ని ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లోద్దని నివారించానన్నారు. తాను బీజేపీలో చేరుతున్నానన్నా వార్తలను కూడా బీజేపీ చౌకబారు శాఖ పనులేనని తాను బీజేపీ లో చేరేది లేదని తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు.