telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైభవంగా ప్రారంభమైన దేవీ దేవి శరన్నవరాత్రులు ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ ఇం ద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 15వ తేదీ వరకు 9 రోజులు పాటు జరిగే నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కో విశేష

అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్లవ నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం శుధ్ద పాడ్యమి ప్రారంభయ్యే దసరా ఉత్సవాలు పదవరోజు దశమి నాడు ముగుస్తాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు దుర్గాదేవి శ్రీ స్వర్ణకవచాలంక్రుత అలంకారంలో దర్శనమిస్తున్నారు.

ఈరోజు ఉదయం సుప్రబాత సేవ, స్నపనాభిషేకం , బాల బోగ నివేదన , నిత్యార్ఛనాదికములు ముగిసిన అనంతరం ఉత్సవాలకు అంకుకారర్పణ‌ చేయనున్నారు. ఈ ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కలుగనుంది.
కనకదుర్గమ్మ దర్శనం కోసం వేలాదిగా తరలిరానున్న భక్తజనానికి ఇబ్బంది లేకుండా.. ఆలయ సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. రోజుకు పదివేల మంది భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతి ఇస్తున్నారు.

ఉచిత దర్శనం నాలుగు వేలు, 100 రూపాయల టిక్కెట్ దర్శనం 3 వేల మందికి, 300 రూపాయల టిక్కెట్ దర్శనం మూడు వేల మంది చొప్పున అన్‌లైన్ స్లాట్ ఉన్న వారికి మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు మూడు క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు.

Related posts