టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదాను తెచ్చిపెట్టిన “అర్జున్ రెడ్డి” చిత్రం “కబీర్ సింగ్” పేరుతో ఇటీవలే బాలీవుడ్ లో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. మాతృకను రూపొందించిన సందీప్ వంగా ఈ రీమేక్‌కు కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా హీరో షాహిద్ కపూర్‌తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ‘కబీర్ సింగ్” బ్లాక్‌బస్టర్ హిట్‌తో బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ దశ తిరిగిపోయింది.కేవలం 50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు మూడొందల కోట్ల రూపాయల పైచిలుకు వసూళ్లు సాధించింది. దీంతో షాహిద్ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడట. తెలుగులో హిట్‌గా నిలిచిన `జెర్సీ` హిందీ రీమేక్‌లో నటించడానికి ఏకంగా 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ఈ రెమ్యునరేషన్ వ్యవహారంపై తాజాగా షాహిద్ స్పందించాడు. “నేను ‘కబీర్ సింగ్’ పారితోషికమే ఇంకా తీసుకోలేదు. ఆ డబ్బు రావాలంటే నేను మరో సినిమాకు సంతకం చేయాలి. ‘కబీర్ సింగ్’ వల్ల లాభపడిన వారు చిత్ర నిర్మాతలు మాత్రమే. `కబీర్‌సింగ్`కి ముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో ఇప్పుడు కూడా అంతే ఉంది” అని షాహిద్ తెలిపాడు.
previous post
ఈ సారి కంటెస్టెంట్లు బోర్ కొట్టిస్తున్నారు..